News September 16, 2024
KNR: ట్రాక్టర్ నడిపిన బండి సంజయ్

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన కరీంనగర్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శోభయాత్ర ర్యాలీలో ట్రాక్టర్‌ను నడిపి సరదాగా గడిపారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 6, 2025
గ్రామపంచాయతీ ఎన్నికల భద్రతపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రత ఏర్పాట్లపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం శనివారం కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల బైండోవర్‌ను పూర్తి చేసి, వారిపై నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు.
News December 6, 2025
రక్త సంబంధీకుల నుంచి బాబు దత్తత

జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య ఆధ్వర్యం పిల్లలు లేని దంపతులు తమ రక్త సంబంధీకుల నుంచి 12 నెలల బాబును చట్టపరంగా దత్తత తీసుకున్నారు. ఈ దత్తత ఉత్తర్వులను శనివారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దంపతులకు అందజేశారు. దత్తత ప్రక్రియ తప్పనిసరిగా చట్టబద్ధంగా ఉండాలని, దీని కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.