News June 13, 2024

KNR: ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్.. 40 మంది మైనర్లు పట్టివేత

image

కరీంనగర్ పట్టణంలోని పలుచోట్ల టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో గురువారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపిన దాదాపు 40 మంది మైనర్లు పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన వాహనాలను KNR ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేని మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలువ్వొద్దన్నారు.

Similar News

News February 26, 2026

కరీంనగర్ బస్టాండ్‌లో లగేజీ బ్యాగు లభ్యం

image

కరీంనగర్ బస్టాండ్ పోలీస్ అవుట్‌పోస్ట్ పరిధిలో పది రోజుల క్రితం ఒక సూట్‌కేసు లభ్యమైంది. అందులో విలువైన దుస్తులు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆధార్ కార్డు ఉన్నాయి. కార్డులోని ఫోన్ నంబర్‌కు పోలీసులు ప్రయత్నించగా సిగ్నల్ అందడం లేదు. బాధితులు 9440469543, 8712580332 నంబర్లలో సంప్రదించి, ఆధారాలు చూపి బ్యాగును తీసుకెళ్లాలని అవుట్‌పోస్ట్ పోలీసులు కోరారు.

News February 26, 2026

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రా

image

కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న పమేలా సత్పతిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం, కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రాను నియమించారు. ప్రస్తుతం ఆమె ITDA ఏటూరునాగారంలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టర్ చిత్ర మిశ్రా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

News February 25, 2026

KNR: ‘మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి’

image

అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం ద్వారా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిర్మూలన చట్టం – 2013 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో లోకల్ కమిటీ మెంబర్ రాజా రెడ్డి ఈ చట్టంపై అవగాహన కల్పించారు. పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం ఈ చట్టం ఎంత ముఖ్యమో వివరించారు.