News March 16, 2025

KNR: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు ఎప్పుడో?

image

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాల విద్యార్థులు తమ డిగ్రీ ఫలితాలు ఎప్పుడా అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ BSC, BCOM రెగ్యులర్, బాక్‌లాగ్ పరీక్షలు గత సంవత్సరం డిసెంబర్, జనవరి మధ్యలో నిర్వహించగా దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సకాలంలో ఫలితాలను విడుదల చేయాలని కోరారు.

Similar News

News December 16, 2025

VKB: ఓట్ల కోసం వస్తూ యువకుడి మృతి

image

ఓట్ల కోసం వస్తూ ప్రమాదంలో యువకుడు మరణించిన ఘటన కుల్కచర్ల మండలంలోని బండమీది తండాలో జరగింది. పోలీసుల ప్రకారం.. HYD శేర్లింగంపల్లి నుంచి ఓట్లు వేసేందుకు సొంత గ్రామానికి వస్తుండగా బైకును టిప్పర్ ఢీకొని మరణించాడు. ఎన్నికలు జరుగుతున్న వేళ గ్రామంలో యువకుడు మరణించడంతో విషాదచాయలు అమ్ముకున్నాయి. ఓట్లు వేసేందుకు తాండా ప్రజలు ఆసక్తి చూపించడం లేదని ప్రజలు పేర్కోటున్నారు.

News December 16, 2025

NZB: కాల్పుల ఘటన.. అనుమానితుల ఫొటోలు విడుదల

image

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవి తండా వద్ద మంగళవారం జరిగిన <<18584756>>కాల్పుల ఘటనపై అనుమానితులను<<>> స్థానికులు గుర్తించారు. అయితే దేవి తండా పరిసర ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు గమనించి ఫొటోలు తీశారు. ఫొటోల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ఇందల్వాయి పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

News December 16, 2025

BHPL: సర్పంచులుగా గెలుపొందిన మాజీ ఎంపీపీలు

image

జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గణపురం, భూపాలపల్లి మండలాల తాజా మాజీ ఎంపీపీలు కావటి రజిత, మందల లావణ్య రెడ్డిలు సర్పంచులుగా విజయం సాధించారు. రజిత (కాంగ్రెస్) చెల్పూర్ సర్పంచ్‌గా, లావణ్య రెడ్డి (బీఆర్‌ఎస్‌) గొర్లవీడు సర్పంచ్‌గా గెలుపొందారు. ఎంపీపీ స్థాయి నుంచి సర్పంచులుగా గెలవడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.