News May 19, 2024

KNR: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

image

తల్లి మందలించిందని ఓ యువతి గడ్డి మందు తాగి మృతి చెందింది. స్థానికుల వివరాలు.. కమాన్పూర్ మం. బురకాయ పల్లె గ్రామానికి చెందిన బొడ్డుపల్లె సింధు(19)ను ఈ నెల 14న ఇంట్లో చెప్పిన పని చేయడం లేదని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 4, 2024

కరీంనగర్: రూ.17.88 కోట్ల బకాయిలు!

image

కరీంనగర్ జిల్లాలోని పలు మహిళా సంఘాలు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు ఉపాధితో పాటు ఇతర అవసరాలకు రుణాలు వినియోగించుకుంటున్నారు. కొందరు చెల్లించలేకపోవడంతో వడ్డీ, అసలు కలిపి భారంగా మారుతున్నాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నగర, పురపాలికల్లో వేల సంఖ్యలో స్వశక్తి సంఘాలు పనిచేస్తున్నాయి. రుణం చెల్లించని సంఘాలు 576 ఉండగా, రూ.17.88 కోట్ల బకాయిలు ఉన్నాయి.

News October 4, 2024

పెద్దపల్లి: టెన్త్ విద్యార్థి మృతి

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన కంటే చిన్నా(15) అనే పదో తరగతి విద్యార్థి వైరల్ ఫీవర్‌తో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే గత పదిరోజులుగా చిన్నా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో రెండు కిడ్నీల్లో ఇన్‌ఫెక్షన్ వచ్చి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News October 4, 2024

కరీంనగర్: నేడు ముద్దపప్పు బతుకమ్మ

image

కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి పూజలు చేస్తారు. ప్రధానంగా ముద్దపప్పును నివేదిస్తారు కాబట్టి ‘ముద్దపప్పు బతుకమ్మ’గా పిలుస్తారు. మూడోరోజు వాయినంగా ముద్దపప్పు, సత్తుపిండి, పెసర్లు, బెల్లం కలిపి పెడతారు.