News April 18, 2024

KNR: తీవ్ర విషాదం.. బాలింత మృతి

image

ప్రసవానికి వెళ్ళిన బాలింత డెలివరీ అనంతరం మృతిచెందిన ఘటన కరీంనగర్‌లో జరిగింది. తీగలగుట్ట పల్లికి చెందిన వర్షినికి పురిటి నొప్పులు రావడంతో వారం రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆపరేషన్ వికటించి
ఆమె మృతి చెందిందని బంధువులు తెలిపారు. దీంతో ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున బంధువులు ఆందోళన చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆరోపించారు.

Similar News

News November 27, 2025

కరీంనగర్‌లో తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి రోజు 92 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. గంగాధరలో అత్యధికంగా 28 నామినేషన్లు దాఖలయ్యాయి. చొప్పదండిలో 15, కొత్తపల్లిలో 12, కరీంనగర్ రూరల్‌లో 10, రామడుగులో 27 నామినేషన్లు నమోదయ్యాయి. 866 వార్డులకు గాను, తొలి రోజు 86 వార్డు సభ్యుల నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వివరించారు.

News November 27, 2025

KNR: “ఆరోగ్య మహిళ” వైద్య పరీక్షలు తప్పనిసరి: కలెక్టర్

image

జిల్లాలోని మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్జీవోల సంఘం, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా, కలెక్టర్ హాజరై ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. సుమారు రూ.50 వేల విలువచేసే 45 రకాల పరీక్షలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News November 27, 2025

KNR: ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు

image

మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు కరీంనగర్ లోని డా.బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ పమేలా సత్పతి హాజరై పలు ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు. చెస్, క్యారం, రన్నింగ్, షార్ట్ పుట్, జావలిన్ త్రో వంటి పోటీల్లో విభాగాల వారీగా అంధులు, బధిరులు, శారీరక, మానసిక దివ్యాంగులు తమ ప్రతిభను చాటారు.