News July 6, 2024
KNR: త్వరలో కొత్త రేషన్ కార్డులు!

కొత్త రేషన్ కార్డులు జారీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ-సేవ పోర్టల్ ఓపెన్ చేసి కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.
Similar News
News December 11, 2025
జిల్లాలో ఓటేసేందుకు ముందుకొస్తున్న యువత

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో కొందరు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి కాస్త బద్దకిస్తున్నట్లు కన్పిస్తోంది. యువత మాత్రం ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటేసేందుకు ఓటర్లు వస్తుండడంతో పల్లెల్లో సందడి నెలకొంది.
News December 11, 2025
కరీంనగర్: నేడే 92 గ్రామాల్లో పోలింగ్.. రెడీనా?

కరీంనగర్ జిల్లాలో తొలివిడతలో 5 మండలాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. చొప్పదండి (16), రామడుగు (23), గంగాధర(33), కొత్తపల్లి (6), కరీంనగర్ గ్రామీణ(14) లలో జరగనున్నాయి. మొత్తం 92 గ్రామాలు ఉన్నాయి. ఎన్నికలలో ఎలాంటి ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉ. 7 నుంచి మ. 1గంట వరకు జరగనుండగా.. మ. 2గంటల నుంచి నుంచి ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి ఓటేసేందుకు రెడీనా?
News December 11, 2025
కరీంనగర్: ఈనెల 21న ప్రత్యేక లోక్ అదాలత్

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈనెల 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు అదనపు సీనియర్ సివిల్ జడ్జ్, ఇన్ఛార్జ్ కార్యదర్శి కే.రాణి ఒక ప్రకటనలో తెలిపారు. క్రిమినల్, సివిల్, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసులు సహా వివిధ కేసులు పరిష్కరించేందుకు ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.


