News October 29, 2024
KNR: దీపావళి వేడుకలకు ముస్తాబైన శ్రీ మహాశక్తి దేవాలయం
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే దీపావళి పండుగ వేడుకల కోసం కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. 31 గురువారం నరక చతుర్దశి, దీపావళి సందర్భంగా నిర్వహించనున్న వేడుకలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది. దీపావళి మహోత్సవ వేడుకలు ప్రారంభమైన నేపథ్యంలో దేవాలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, పూల అలంకరణతో కనువిందు చేసేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
Similar News
News October 31, 2024
Way2 Special.. కరీంనగర్: శ్మశానంలో దీపావళి!
దీపావళిని సాధారణంగా ఇంట్లో అందరితో కలిసి టపాసులు కాల్చుతూ జరుపుకుంటారు. కానీ, మన కరీంనగర్ జిల్లాలో మాత్రం దాదాపు 6 దశాబ్ధాల నుంచి శ్మశాన వాటికలో జరుకుంటున్నారు. అదెక్కడో కాదండోయ్! నగరంలోని కార్ఖనగడ్డ వద్ద గల హిందూ శ్మశాన వాటికలో. ఓ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు మరణించిన తమ బంధువుల సమాధుల వద్ద నైవేద్యాలు, కొవ్వొత్తులు వెలిగించి, పిండివంటలు పెట్టి టపాసులు కాలుస్తూ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు.
News October 31, 2024
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు బండి సంజయ్ నివాళి
నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ చౌక్ ఢిల్లీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా న్యూ ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ దంకర్, కేంద్ర మంత్రులు పలువురు ఎంపీలు ఉన్నారు.
News October 31, 2024
కార్తీక మాసం.. వేములవాడకు ప్రత్యేక బస్సులు: RM సుచరిత
కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం సోమ, మంగళవారాల్లో వేములవాడ నుంచి వరంగల్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కరీంనగర్ RM సుచరిత తెలిపారు. శని, ఆదివారాల్లో వరంగల్ నుంచి వేములవాడకు సర్వీసులు నడుపుతామని పేర్కొన్నారు. శబరిమలకు వెళ్లే భక్తులకు, అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు.