News July 18, 2024
KNR: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు

ఉపాధ్యాయ పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న DSC-2024 ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. వచ్చేనెల 5 వరకు జరిగే ఈ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలలో 34,254 ఉంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులు కేంద్రాలకు నిర్ణీత సమయానికి గంటన్నర ముందుగా హాజరుకావాలని కరీంనగర్, పెద్దపల్లి DEOలు జనార్దన్ రావు, మాధవి తెలిపారు.
Similar News
News November 12, 2025
కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమీషనర్ HYD ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2025- 26 సంవత్సరానికి చెందిన 9వ,10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి తెలిపారు. www.tgepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రూ.4 వేలు మంజూరు అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 12, 2025
జాతీయస్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈనెల 6, 7వ తేదీలలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో జరిగిన రాష్టస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో 9వ తరగతికి చెందిన యన్.ప్రమధశ్రీ యస్.శ్రీసాన్విక, కే.శ్రీవికాస్, కే.వైష్ణవి జాతీయ స్థాయి కళా ఉత్సవ్(జాతీయస్థాయి) పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థులను ఈరోజు కలెక్టర్ పమేలా సత్పత్తి కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు.
News November 11, 2025
ఖమ్మం డీఈఓగా చైతన్య జైనీ బదిలీ

ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖాధికారి (డీఈఓ)గా కరీంనగర్ డీఈఓ చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కరీంనగర్ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన చైతన్య జైనీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. కాగా, కరీంనగర్ డీఈఓగా డైట్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య కొనసాగనున్నారు.


