News June 13, 2024

KNR: నేటి నుంచి డీలక్స్ బస్సు సర్వీసులు

image

వరంగల్ నుంచి నిజామాబాద్ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గురువారం నుంచి డీలక్స్ బస్సులు నడపనున్నట్లు కరీంనగర్ రీజియన్ ఆర్ఎం సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో డీలక్స్ బస్సులను అదనంగా నడుపుతున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News March 25, 2025

KNR: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్

image

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం ఆమె కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం పూర్తిగా పండిన తర్వాతనే హార్వెస్ట్ చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల వారీగా నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటుచేసి, తేమను కొలిచే యంత్రాలు, గన్ని సంచులు, టార్పలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలన్నారు.

News March 25, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కొత్తపల్లి-ధర్మారం 37.7°C నమోదు కాగా, తాంగుల, ఈదులగట్టేపల్లి, బురుగుపల్లి, ఇందుర్తి 37.6, జమ్మికుంట, మల్యాల 37.5°C, నుస్తులాపూర్ 37.3, కరీంనగర్ 37.1, వీణవంక, గట్టుదుద్దెనపల్లె, పోచంపల్లి 36.9, గంగిపల్లి 36.8, తాడికల్ 36.5, బోర్నపల్లి 36.1, దుర్శేడ్, చింతకుంట, గుండి 36.0°C గా నమోదైంది.

News March 25, 2025

KNR: BJP స్టేట్ చీఫ్‌గా ఎంపీ ఈటల రాజేందర్?

image

ఉగాదిలోపు తెలంగాణ BJPకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది. రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది. అయితే BC నేతను నియమిస్తారా.. లేక OCకి దక్కుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా పరిశీలనలో ఈటల రాజేందర్ ముందువరసలో ఉన్నట్లు తెలిసింది. MP అర్వింద్, DK అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్‌కు మరోసారి అధ్యక్ష పదవీ దక్కొచ్చని చర్చ జరుగుతోంది.

error: Content is protected !!