News February 21, 2025
KNR: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. ఈనెల 16 నుంచి 20 వరకు ఈ రైలును తాత్కాలికంగా రద్దుచేశారు. మళ్లీ శుక్రవారం (21) పునరుద్ధరించనున్నారు. మధ్యాహ్నం 3.35గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇది బయలుదేరనుంది. ప్రయాణికులు గమనించి రైలును వినియోగించుకోవాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.
Similar News
News November 18, 2025
పత్తి కొనుగోళ్లు పునః ప్రారంభించండి: మంత్రి తుమ్మల

ఖమ్మం: జిన్నింగ్ మిల్లులు తమ సమ్మెను తక్షణమే విరమించి, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి, తేమ నిబంధనలపై కేంద్రం సమీక్షించి, సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను CCIతో చర్చించి పరిష్కరిస్తామని తుమ్మల భరోసా ఇచ్చారు.

JGTL: PM శ్రీ ల్యాబ్‌ల ఏర్పాటులో జాప్యమెందుకు..?

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.3.54 కోట్లతో మొత్తం 18 ల్యాబ్‌లను మంజూరు చేయగా, ఇప్పటికీ కేవలం 3 మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 15 ల్యాబ్‌ల పనులు కొనసాగుతున్నాయి. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికైనా పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని విద్యార్థులు కోరుతున్నారు.