News September 16, 2024
KNR: నేడు గంగమ్మ ఒడికి గణనాథులు
నవరాత్రుల పాటు పూజలందుకున్న ఏకదంతుడు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు ఉమ్మడి KNRజిల్లా అంతటా గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10,325 విగ్రహాలను ప్రతిష్ఠించగా ఇప్పటికే కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు. DJలను నిషేధించినట్లు పోలీసులు ప్రకటించడంతో నిర్వాహకులు కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Similar News
News October 13, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు. @ జగిత్యాల లో కస్టమర్ పై టిఫిన్ సెంటర్ సిబ్బంది దాడి. @ హుస్నాబాద్ లో దసరా వేడుకలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ భీమారం మండలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి. @ శంకరపట్నం మండలంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.
News October 12, 2024
బీమారం : కరెంట్ షాక్‌తో యువకుడి మృతి
భీమరం మండలం రాగోజీపేటలో దసరా పండగ పూట విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మహిషాసుర మర్ధిని కార్యక్రమంలో రావణాసురుడి బొమ్మకు నిప్పు పెట్టే ప్రయత్నంలో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి అరిసెల వెంకటేష్ ( 36) అక్కడే కుప్పకూలి పడిపోయాడు. గ్రామస్థులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా మృతిచెందాడని వైద్యులు తెలిపారు.
News October 12, 2024
KNR: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు
దసరా సందర్భంగా కరీంనగర్ జిల్లాలో నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. వంట నూనెల నుంచి కూరగాయల వరకు ధరలు గత 20 రోజుల్లో 30% రెట్లు అధికం కావడంతో సామాన్యులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. గత 20 రోజుల క్రితం సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు ధర రూ.115 ఉండగా ప్రస్తుతం రూ. 145-150 వరకు, పామాయిల్ ధర రూ.90ఉండగా రూ. 125వరకు ఉన్నాయి.