News January 31, 2025
KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.
Similar News
News December 8, 2025
ఊల వేసిన మడిలో నీరుంటుందా?

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News December 8, 2025
సిద్దిపేట: ఈ మండలంలో 6 సర్పంచులు ఏకగ్రీవం

సిద్దిపేట జిల్లాలోనే 38 గ్రామపంచాయతీలతో అతిపెద్ద మండలం అక్కన్నపేట. రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికలకు అక్కన్నపేట మండలం మూడో విడత ఎన్నికలకు ఎంపికైంది. మండలంలోని శ్రీరామ్ తండా, దుబ్బతండా, చౌడుతండా, దాసుతండా, గొల్లపల్లి, కుందనవానిపల్లి 6 గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మండలంలో చాలా గ్రామాల్లో వార్డులు కూడా ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవ ఎన్నికల జరిగాయి.
News December 8, 2025
నేటి నుంచే గ్లోబల్ సమ్మిట్.. విశేషాలివే!

TG: గ్లోబల్ సమ్మిట్-2025ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ ఇవాళ 2PMకు ప్రారంభిస్తారు. 80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్లుగా ఏర్పాట్లు పూర్తికాగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా USA నుంచి 54 మంది హాజరుకానున్నారు. ఇవాళ, రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. 1,000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1,500 మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు.


