News January 31, 2025
KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.
Similar News
News July 8, 2025
పోలీసుల ప్రతిభను గుర్తించడానికే ఈ పోటీలు: KNR సీపీ

KNR పోలీస్ కమీషనరేట్ కేంద్రంగా రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు ఈ ‘పోలీసు డ్యూటీ మీట్’ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ పేర్కొన్నారు. నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత, నైపుణ్యం కనబరిచే విధంగా ఈ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
News July 8, 2025
చేప పిల్లల ఉత్పత్తిలో కరీంనగర్ ప్రథమం: మంత్రులు

కరీంనగర్ ఉజ్వల పార్క్ సమీపంలోని చేప పిల్లల పెంపక కేంద్రాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సోమవారం సందర్శించారు. జిల్లాలో చేపల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని, రాష్ట్రంలో కరీంనగర్ చేప పిల్లల పెంపకంలో ప్రథమస్థానంలో ఉందని అన్నారు. స్థానికంగా నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేస్తున్నామని, భవిష్యత్లో మార్కెట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News July 8, 2025
కరీంనగర్: విధుల్లో నిర్లక్ష్యం చూపిన అధికారి తొలగింపు

కరీంనగర్ మండల విద్యాధికారి కే.భద్రయ్య తన విధుల పట్ల పలుమార్లు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూపడమే కాకుండా పైఅధికారుల ఆదేశాలను పాటించకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఆయనను విధుల నుంచి తొలగిస్తూ వీణవంక మండలంలోని ఎల్బక జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు ఎం.అంజా రెడ్డికి కరీంనగర్ మండల విద్యా అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.