News November 5, 2024

KNR: పట్టభద్రులు మేల్కోండి.. రేపే చివరి రోజు!

image

ఉమ్మడి KNR జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల ప్రచార సందడి రోజురోజుకు పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. పట్టభద్రులను కలుస్తూ NOV 2021 వరకు డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. సోమవారం నాటికి ఉమ్మడి జిల్లాలో 1,18,822 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. మరి మీరు అప్లై చేశారా? కామెంట్ చేయండి.

Similar News

News November 25, 2025

HZB: పేదలకు మెరుగైన వైద్యం అందజేయాలి: బండి

image

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సందర్శించారు. సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

News November 25, 2025

KNR: భవన నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సులు

image

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పది రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ తెలిపారు. లేబర్ కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు డిసెంబర్ 3 వరకు ఈ సదస్సులు జరుగుతాయి. ప్రమాద బీమా, సహజ మరణం, పెళ్లి కానుక, ప్రసూతి లబ్ధి వంటి అంశాలపై నిర్వహించే ఈ సదస్సులను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 24, 2025

KNR: ‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.