News March 6, 2025
KNR: పట్టభద్రుల ఎమ్మెల్సీ.. గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న అంజిరెడ్డి

ఉమ్మడి మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి గెలుపు ధ్రువీకరణ పత్రం బుధవారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు. ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాష్ జ్యోతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 15, 2025
రాజకీయాలు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు

బిహార్ మాజీ సీఎం, RJD పార్టీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలతో పాటు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. సంజయ్ యాదవ్, రమీజ్ పార్టీ నుంచి వెళ్లిపోమని తనతో చెప్పారని, మొత్తం నింద తానే తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.
News November 15, 2025
తండ్రయిన రాజ్‌కుమార్

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్‌కుమార్ రావు-పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. ఇవాళ వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. 2010లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రాజ్.. స్త్రీ2 చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. పత్రలేఖ కూడా పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.
News November 15, 2025
వయోవృద్ధులను గౌరవిద్దాం: WGL కలెక్టర్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుంచి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు వయోవృద్ధుల వాకథాన్(ర్యాలీ) జరిగింది. కలెక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ప్రారంభించారు. ఈనెల 19 వరకు జిల్లాలో వారోత్సవాలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.


