News February 26, 2026

KNR: పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా..?

image

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వరుసగా నిర్వహించాలని నిర్ణయించి జీపీ, మున్సిపాలిటీల ఎన్నికలను పూర్తి చేసింది. ఇదే ఊపులో పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహిస్తుందని అనుకున్నారు. కానీ, ఒకవైపు టెన్త్, ఇంటర్ పరీక్షలు, మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం తేలక వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ఆశావాహులకు ఎన్నికల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.

Similar News

News April 19, 2026

MGU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2,4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్‌ను అధికారక ఎంజీయూ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

News April 19, 2026

ఖమ్మం: హారన్‌ కొట్టారని.. కండక్టర్‌పై యువకుడి దాడి

image

రహదారిపై వెళ్తుండగా సైడ్‌ ఇవ్వాలని హారన్‌ కొట్టినందుకు ఓ యువకుడు ఏకంగా ఆర్టీసీ బస్సునే అడ్డుకుని హల్‌చల్‌ చేశాడు. నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. డ్రైవర్‌ రాంబాబుతో వాగ్వివాదానికి దిగిన సదరు యువకుడు, కండక్టర్‌ మంజుల ఫోన్‌ లాక్కొని దురుసుగా ప్రవర్తించాడు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేసిన నిందితుడిని నేలకొండపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News April 19, 2026

వీళ్లు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగొద్దు!

image

ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగితే ఆయా అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి కడుపులో ఇబ్బంది కలగొచ్చు. ఒంట్లో నీరు చేరి వాపులు వచ్చే వారు కూడా వైద్యుల సలహా మేరకే నీటిని తీసుకోవాలి.