News December 1, 2024
KNR: పాఠశాల మధ్యాహ్న భోజనం.. భయపడుతున్న విద్యార్థులు!

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలోమధ్యాహ్నం భోజనం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయిన విషయం తెలిసిందే. అలాగే అసిఫాబాద్ జిల్లాలో ఓ విద్యార్థినిమృతి చెందింది. దీంతో జిల్లాలోని సర్కార్ బడుల్లో మధ్యాహ్నం భోజనం తినాలంటే విద్యార్థులు భయపడుతున్నారు.
Similar News
News February 18, 2025
కరీంనగర్: వ్యక్తిపై కొడవలితో దాడి.. తీవ్ర గాయాలు

హత్యాయత్నం చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బత్తిని సాగర్ పై అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి భూసంబంధిత విషయంలో కొడవలితో దాడి చేయగా సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
CHMD: కీలకంగా మారనున్న మండల ఓటర్లు

హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలో 2,179 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలోనే అత్యధిక MLC ఓట్లు కలిగిన మండలంగా చిగురుమామిడి మండలం కీలకంగా మారనుంది. అయితే MLc అభ్యర్థుల దృష్టి ఈ మండలంపై ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇక్కడి ఓటర్లు ఎవరికీ పట్టం కడుతారో ఫిబ్రవరి 27వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
News February 18, 2025
కరీంనగర్: జీవం తీస్తున్న ఆన్లైన్ జూదం..!

ఇద్దరు యువకులు ఆన్‌లైన్ మోసాలకు బలైన ఘటన శంకరపట్నం మండలంలో జరిగింది. గద్దపాకకి చెందిన భూస కార్తిక్(25) ఆన్‌లైన్ రమ్మీ ఆడి రూ.15లక్షలు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పలపల్లికి చెందిన ఎడిగమధు(35) అనే యువ రైతు ఆన్‌లైన్ జూదంలో రూ. 10 లక్షలు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగుల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.