News July 13, 2024
KNR: ‘పిల్లల సంరక్షణకు హెల్ప్ డెస్క్’

జిల్లాలోని 18 ఏళ్లలోపు బాలల సంరక్షణకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్ 9490881098తో కూడిన కంట్రోల్ రూమ్‌ను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోని బాల రక్షాభవన్లో ఏర్పాటు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపారు. ఈ నంబర్‌కు అత్యవసరమైన సమయంలో ఫోన్, వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 26, 2026
కరీంనగర్ నూతన కొత్త కలెక్టర్ చిత్ర మిశ్రా ప్రొఫైల్

కరీంనగర్ జిల్లా పాలనా పగ్గాలను 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి చిత్ర మిశ్రా చేపట్టారు. సంగారెడ్డికి చెందిన ఆమె, నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా, మున్సిపల్ కమిషనర్‌గా సమర్థవంతంగా పనిచేశారు. ఇటీవల ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో విశేష కృషి చేశారు. యువ అధికారిణి రాకతో కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో సరికొత్త వేగం పుంజుకోనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
News February 26, 2026
కరీంనగర్ బస్టాండ్‌లో లగేజీ బ్యాగు లభ్యం

కరీంనగర్ బస్టాండ్ పోలీస్ అవుట్‌పోస్ట్ పరిధిలో పది రోజుల క్రితం ఒక సూట్‌కేసు లభ్యమైంది. అందులో విలువైన దుస్తులు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆధార్ కార్డు ఉన్నాయి. కార్డులోని ఫోన్ నంబర్‌కు పోలీసులు ప్రయత్నించగా సిగ్నల్ అందడం లేదు. బాధితులు 9440469543, 8712580332 నంబర్లలో సంప్రదించి, ఆధారాలు చూపి బ్యాగును తీసుకెళ్లాలని అవుట్‌పోస్ట్ పోలీసులు కోరారు.
News February 26, 2026
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రా

కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న పమేలా సత్పతిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం, కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రాను నియమించారు. ప్రస్తుతం ఆమె ITDA ఏటూరునాగారంలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టర్ చిత్ర మిశ్రా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.


