News August 3, 2024
KNR: పెండింగ్ సమస్యలపై సమీక్ష సమావేశం
ఆర్వోఆర్ చట్టం, పెండింగ్ భూసమస్యల అంశాలపై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. ఇప్పటి వరకు పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జిల్లాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాత సంబంధిత దరఖాస్తుల ఆన్లైన్లో అప్డేట్ చేసి పరిష్కరించాలన్నారు.
Similar News
News September 12, 2024
మేకిన్ తెలంగాణా భావనను పెంపొందించాలి: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రాన్ని ఉత్పాదక రంగంలో అగ్రగామిగా నిలిపేలా ‘మేక్ ఇన్ తెలంగాణా’ భావనను పెంపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామిక రంగానికి పిలుపునిచ్చారు. హైదరబాద్లోని బేగంపేటలో బుధవారం క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా చాప్టర్ 38వ వార్షిక సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఛాప్టర్ ఛైర్మన్ బాలకృష్ణరావు, హన్మంతరావు తదితరులు ప్రసంగించారు.
News September 11, 2024
ఈనెల 17న జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్న మంత్రి, విప్
సెప్టెంబర్ 17న రాష్ట్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్లు జాతీయ పతాక ఆవిష్కరణ చేయాలని సీఎస్ శాంతి కుమారీ ఉత్తర్వులు జారీ జారీచేశారు.
News September 11, 2024
ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన రామగుండం MLA
హైదరాబాద్ సెక్రటేరియట్లో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గం అభివృద్ధి గురించి కాసేపు చర్చించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, కటుకు ధనుంజయ్, అరగంట కృష్ణ, జనగాం శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.