News November 2, 2024

KNR: ‘పెన్షన్, హెల్త్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి’

image

సింగరేణి సంస్థ మాజీ ఉద్యోగులు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ నవంబర్‌లో పెన్షన్, CPRMS (మెడికల్ కార్డు) రెన్యువల్ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రామగుండం సింగరేణి యాజమాన్యం పేర్కొంది. సకాలంలో దరఖాస్తులు చేయకపోతే పెన్షన్ డబ్బులు ఆగిపోతాయని, హెల్త్ కార్డు వ్యాలిడిటీ ముగుస్తుందని పేర్కొన్నారు. సంస్థ ప్రయోజనాల కోసం వెంటనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Similar News

News December 6, 2024

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు

image

KNR జిల్లాలోని పలు పాఠశాలలు, హాస్టళ్లను విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు. స్వచ్ఛమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు.

News December 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్. @ మహాదేవపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ 36వ సారి అయ్యప్ప దీక్ష స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. @ కథలాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ ఇల్లంతకుంట మండలంలో చిన్నారిపై పిచ్చికుక్కల దాడి. @ మెట్పల్లి పట్టణంలో అక్రమ ఇసుక రవాణా లారీ పట్టివేత.

News December 5, 2024

పెద్దపల్లి: 4 ఎకరాల 31 గుంటల్లో బస్సు డిపో

image

పెద్దపల్లి జిల్లా ప్రజల చిరకాల కోరిక బస్సు డిపో ఏర్పాటు తీరింది. పెద్దపల్లి పట్టణంలో 4 ఎకరాల 31 గుంటల్లో బస్సు డిపో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీ అభిమాన నాయకుడు విజ్జన్న నిరంతరం పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారని, ఆయన శాసనసభ్యుడిగా గెలవడం వల్లనే ఈరోజు పెద్దపల్లికి బస్సు డిపో, బైపాస్ రోడ్డు, నాలుగు పోలీస్ స్టేషన్స్ మంజూరు అయ్యాయని తెలిపారు.