News February 19, 2025

KNR: పోలీసుల కస్టడీలో నిందితులు

image

కరీంనగర్ పట్టణం కట్టరాంపూర్‌కు చెందిన సర్వే నంబర్ 954లో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి తప్పుడు హద్దులు చూపుతో భూమిని పలువురికి విక్రయించిన ఘటనలో 13 మందిపై కేసు నమోదు చేసిన ఘటనలో నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. వీరి ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేసి పలు కీలకమైన డాక్యుమెంట్లను కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి.కోటేశ్వర్, ఎస్ఐ రాజన్న స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News February 22, 2025

చొప్పదండి: దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు

image

చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. జూనియర్లపై దాడి చేసిన విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలుంటాయని స్కూల్ డైరెక్టర్ కేసీ రావు తెలిపారు. విషయాన్ని గోరంతను కొండంతలు చేశారని, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న స్కూల్‌ను బదనాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులు ఎన్నో మెడల్స్ సాధించారని తెలిపారు. 

News February 22, 2025

కరీంనగర్: హోమో సెక్స్‌కు అడ్డు చెప్పాడని హత్య

image

హోమో సెక్స్‌కు అడ్డు చెప్పడంతో హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేటకు చెందిన శ్రీనుకు KNRలోని రేకుర్తి గ్రామానికి చెందిన పర్వతం రాజు(40)తో పరిచయం ఉంది. భార్య పిల్లకు దూరంగా ఉంటున్న రాజు.. బుధవారం శ్రీనుకు మద్యం తాగించి హోమో సెక్స్ చేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో తలపై కర్రతో కొట్టడంతో శ్రీను చనిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

News February 22, 2025

KNR: ‘ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్స్ 100% పూర్తి చేయాలి’

image

ప్రాపర్టి టాక్స్ కలెక్షన్ 100 శాతం టార్గెట్ ను పూర్తి చేయాలని కమీషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో శుక్రవారం డివిజన్ల వారిగా నియమించిన వార్డు ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆస్తిపన్నుల వసూళ్లు, ట్రేడ్ లైసెన్స్ లు వాటి పన్నులు, నగరపాలక సంస్థ దుకాణాల రెంటులు, మెండి బకాయి దారులు, అసెస్మెంట్ తదితర అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.

error: Content is protected !!