News January 28, 2025

KNR: పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీల వివరాలు

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కరీంనగర్‌లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో నిర్వహించే క్రీడలు ఫుట్బాల్, కబడ్డీ, ఖో ఖో,వాలీబాల్, అథ్లెటిక్స్, హ్యాండ్ బాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్, షటిల్ బ్యాట్మెంటన్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, హాకీ, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, యోగా, తదితర 29 క్రీడాంశాలలో పోటీలను నిర్వహించనున్నారు.

Similar News

News February 9, 2025

కరీంనగర్ జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.

News February 9, 2025

కాళేశ్వరం: త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్య స్నానాలు

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో 42 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేక మహోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరుగుతున్నాయి. కాగా, భక్తులు కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి, ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉ.10:42కు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

News February 9, 2025

జగిత్యాల జిల్లాలో కీచక టీచర్ అరెస్ట్

image

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఎస్ఐ సుధాకర్ ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ టీచర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరిట 6వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు తల్లదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!