News January 11, 2026

KNR: ప్రత్యేక రైలు రేపటి వరకు పొడిగింపు

image

HYD-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే ఫెస్టివల్ స్పెషల్ రైలును మరో 2 రోజులు పొడిగించారు. ముందుగా ఈ నెల 9, 10వ తేదీల్లో ప్రత్యేక రైలు నడిపిస్తుండగా.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 11, 12 తేదీల్లో కూడా నడపిస్తున్నారు. HYD – సిర్పూర్ కాగజ్‌నగర్(07473) మధ్య 11, 12వ తేదీల్లో ఉ. 7-55 గం.లకు బయలుదేరి మ. 2-15గం.లకు చేరుకుంటుంది. ఉమ్మడి KNRలో ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లో ఆగుతుంది.

Similar News

News January 18, 2026

ప.గో. జిల్లాల్లో తగ్గని సంక్రాంతి సందడి!

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం కోలాహలం నెలకొంది. మూడు రోజుల పాటు కోడిపందేలు, జూద క్రీడల్లో మునిగితేలిన జనం, ఇప్పుడు కుటుంబాలతో కలిసి విహారయాత్రలు, సినిమాలకు క్యూ కట్టారు. ఏలూరు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ భక్తులు, సందర్శకులతో కిటకిటలాడింది. పల్లెల నుంచి పట్నాల బాట పట్టడంతో ప్రధాన రహదారులు అర్ధరాత్రి వరకు రద్దీగా కనిపించాయి. సంక్రాంతి ముగిసినా సంబరాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి.

News January 18, 2026

ఖమ్మం: పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

image

ఈనెల 23, 24, 25న ఖమ్మంలో జరిగే PDSU రాష్ట్ర 23వ మహాసభల విజయవంతానికై రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలిరావాలని రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ యాజమాన్యాలకు అప్పగించి విద్యావ్యవస్థను పూర్తిగా వ్యాపారమయం చేశారని విమర్శించారు.

News January 18, 2026

విశాఖలో ప్రముఖ వైద్యుడి మృతి

image

వేలాది పోలియో, వికలాంగ బాధితులకు జీవితాల్లో వెలుగులు నింపిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదినారాయణరావు(85) శనివారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ప్రేమ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడిగా 4 దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన సుమారు 3లక్షల శస్త్ర చికిత్సలు చేశారు. పోలియో బాధితులకు చేసిన సేవలకుగాను 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన మృతికి వైద్య, ప్రజావర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.