News May 19, 2024
KNR: ప్రేమ పేరుతో మోసం..
ప్రేమ పేరుతో డబ్బులు దండుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ యువతిపై LMD పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. తిమ్మాపూర్‌కు చెందిన నాగరాజు యోగ నిమిత్తం ఈశా ఫౌండేషన్‌కు వెళ్లగా అక్కడ వైజాగ్‌కు చెందిన సంధ్య ప్రియాంకతో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నుంచి రూ. 16లక్షలు యువతి తన బంధువుల ఖాతాలోకి బదిలీ చేయించుకుంది. యువకుడు ఫినాయిల్ తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Similar News
News December 11, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ శంకరపట్నం మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీ. @ ఇబ్రహీంపట్నం మండలంలో హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు. @ కథలాపూర్ మండలంలో జెడ్పి ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి రాము. @ ఈ నెల 15లోగా సీఎంఆర్ అందించాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ చందుర్తి మండలంలో ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్. @ వేములవాడ రాజన్నా ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ. @ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పట్ల మెట్పల్లిలో నిరసన.
News December 10, 2024
KNR: సోషల్ మీడియా క్రేజ్‌లో యువత చిత్తు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియా క్రేజ్‌లో పడి యువత తమ బంగారు జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కుటుంబంతో గడపడం కంటే యువత స్మార్ట్ ఫోన్‌పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరికాదని తెలిసిన కొందరు యువతులు లైకులు, కామెంట్ల కోసం ఇటీవల ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
News December 10, 2024
ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ: KNR ఆర్టీసీ RM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఈ రాయితీ ఈనెల 1 నుంచి 31 వరకు ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్, రాజధాని బస్సు సర్వీసుల్లో వర్తిస్తుందన్నారు. కావున, ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.