News March 19, 2025
KNR: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

ఉమ్మడి KNR జిల్లాలోని 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల సంస్థ రీజినల్ కో ఆర్డినేటర్ అంజలి కుమారి తెలిపారు. మార్చి 31 వరకు ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. www.mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News November 27, 2025
ములుగు: పంచాయతీ ఎన్నికలకు 1,306 పోలింగ్ స్టేషన్లు

ములుగు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు 217 లొకేషన్లలో 1,306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 146 సర్పంచ్, 1,290 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు 1,880 మంది పీఓలు, 2,010 మంది ఓపీఓలను నియమించారు. 1,566 బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయ్యింది. సర్పంచ్ బరిలో 8మంది కంటే ఎక్కువ మంది ఉంటే అప్పటికప్పుడు ముద్రించేలా ప్రింటింగ్ ప్రెస్‌లను గుర్తించారు.
News November 27, 2025
ములుగు కలెక్టరేట్‌లో కొత్త విత్తన ముసాయిదాపై చర్చ

రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు, ఇతర వాటాదారుల నుంచి కొత్త విత్తన బిల్లు ముసాయిదాపై అభిప్రాయాలు సేకరించామని అదనపు కలెక్టర్ మహేందర్ జీ తెలిపారు. ఈరోజు ములుగులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విత్తనబిల్లు-2025లోని సెక్షన్లు, క్లాసులు, విత్తన చట్టం, 1966లోని లోపాలు, కొత్త విత్తన చట్టం లక్ష్యాలు వంటి ప్రతి అంశంపై చర్చించామన్నారు.
News November 27, 2025
విశాఖ: వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి రాబిస్ వ్యాధి రాకుండా యాంటీ రాబిస్ వ్యాక్సిన్‌ను గురువారం వేశారు. జీవీఎంసీ పరిధిలో 50 మంది వీధి కుక్కలను పట్టుకునే సిబ్బందికి, శస్త్ర చికిత్సలు నిర్వహించే వారికి వ్యాక్సిన్ వేశారు. వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు,శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రవర్తించి పట్టుకోవాలని కమిషనర్ ఆదేశించారు.


