News March 19, 2025

KNR: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

image

ఉమ్మడి KNR జిల్లాలోని 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల సంస్థ రీజినల్ కో ఆర్డినేటర్ అంజలి కుమారి తెలిపారు. మార్చి 31 వరకు ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. www.mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

Similar News

News February 27, 2026

తిరుపతిలో గరుడ వారధిపై యువకుడి మృతి

image

తిరుపతిలో గరుడ వారధిపై మరొకరు చనిపోయారు. తాతయ్యగుంటకు చెందిన ఆదం ద్వారక(23) తిరుచానూరులో జరిగిన వివాహానికి వెళ్లాడు. మరొకరితో కలిసి బైకుపై తిరిగి వస్తుండగా.. బ్లిస్ సర్కిల్ సమీపంలో గరుడ వారధిపై బైక్ అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ద్వారక స్పాట్‌లోనే చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడిన మరో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హేమాద్రి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News February 27, 2026

నర్సాపూర్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్‌లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తహశీల్దార్ శ్రీనివాస్, అధికారులున్నారు.

News February 27, 2026

సీబీఐపై కోర్టు తీవ్ర ఆగ్రహం

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలున్నాయంటూ కేసును కొట్టివేసింది. సరైన ఆధారాలు లేకుండానే వారిని కేసులో ఇరికించారని మండిపడింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కాగా లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసు నడుస్తోంది.