News September 27, 2024

KNR: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!

image

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్‌.. బిడ్డాలెందరూ కోల్‌’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.

Similar News

News October 10, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,08,966 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.54,712, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.35,920, అన్నదానం రూ.18,334,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News October 10, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మెట్ పల్లి పట్టణంలో బీసీల సత్యాగ్రహ దీక్ష. @ జగిత్యాలలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. @ సైదాపూర్ మండలంలో తమ్ముడి ని హత్య చేసిన అన్న. @ కోరుట్లలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని భారీ ర్యాలీ. @ సిరిసిల్లలో ముగిసిన పోలీసుల క్రీడలు. @ పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. @ పోగాకు నివారణకు చర్యలు చేపట్టాలన్న సిరిసిల్ల కలెక్టర్.

News October 9, 2024

రోగులకు అత్యుత్తమ వైద్యసేవలను అందించాలి: మంత్రి శ్రీధర్‌బాబు

image

సీజన్ మార్పు వల్ల ప్రబలే అంటూ వ్యాధులు, వైరల్ జ్వరాల బారిన పడిన రోగులకు అత్యుత్తమ చికిత్స అందించి, నివారణ చర్యలు చేపట్టాలని ఐటీమంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ప్రమోద్‌ను బుధవారం ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలకు దోమలు విపరీతంగా పెరిగాయన్నారు. వాటి నిర్మూలనకు యాంటీ లార్వల్ కార్యక్రమాలు ప్రతి గ్రామం, మున్సిపాలిటీల పరిధిలో చేపట్టాలన్నారు.