News August 2, 2024

KNR: బోసిపోయిన చెరువులు నిండుతున్నాయి

image

ఇన్నాళ్లు నీరు లేక వేలవేల బోయిన చెరువుల్లో జలకళ సంతరించుకుంటుంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుకుంటున్నాయి. కరీంనగర్ మండలంలో దాదాపు పెద్ద చెరువులు 33 ఉండగా.. చిన్న చెరువులు, కుంటలు 40 వరకు ఉంటాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులోకి నీరు చేరి జలకళ సంతరించుకుంటుంది. ఇన్నాళ్లు వెలవెలబోయిన చెరువులు నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 21, 2024

శాతవాహన యూనివర్సిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల

image

గత మూడు సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో ఎలాంటి పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా వేల మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని ఇటీవల జేఏసీ ఛైర్మన్ చెన్నమల్ల చైతన్య ఆధ్వర్యంలో వీసీ దృష్టికి తీసుకెళ్ళారు. శనివారం వీసీ ఉమేష్ కుమార్ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల జేఏసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. వీసీ కి జేఏసీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

News December 21, 2024

సిరిసిల్ల: మరో నేత కార్మికుడి ఆత్మహత్య

image

నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్లలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల పట్టణం BY నగర్‌కు చెందిన నక్క శ్రీనివాస్(41) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా నిన్న మరో నేత కార్మికుడు<<14931601>> దూస గణేశ్ సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే.

News December 21, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,39,961 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.78,396 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.41,040, అన్నదానం రూ.20,525,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ వివరించారు.