News July 18, 2024
KNR: బ్యాంకర్లు నిబంధనలు పాటించాలి: కలెక్టర్
రైతు రుణమాఫీ అంశంలో బ్యాంకర్లు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కరీంనగర్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 35,686 రైతు కుటుంబాలకు సంబంధించిన 37,745 బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం 194.64 కోట్లు జమ చేయనుందన్నారు. రేషన్ కార్డును కేవలం రైతు కుటుంబాల గుర్తింపు కోసమే ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
Similar News
News December 12, 2024
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఏ విధంగా సర్వే చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయన వెంట ఆర్డీవో జివాకర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారి రాజేశ్వర్, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News December 12, 2024
మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?: KTR
రేవంత్ మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా? రూ.50 వేల కోట్లు, రూ.65 వేల కోట్లు వడ్డీలు కడుతున్నామని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియా స్టేటస్ Xలో షేర్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ ఏడాది తెలంగాణ కట్టాల్సిన వడ్డీ రూ.22,406 కోట్లు అని ఆర్బీఐ పేర్కొందని అన్నారు. కాకి లెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా అని విమర్శించారు.
News December 12, 2024
కోరుట్ల: 5 నెలల చిన్నారికి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెడల్
కోరుట్లకు చెందిన 5 నెలల చిన్నారి శీలం శ్రీకృతి అరుదైన రికార్డు సాధించింది. 5 నెలల వయసులోనే ఫ్లాష్ కార్డులను ఆల్ఫాబెట్స్, పక్షులు, జంతువులు, పండ్లను అలవోకగా గుర్తిస్తుంది. అతి చిన్న వయసులో ఫ్లాష్ కార్డులను గుర్తు పట్టడంతో చిన్నారిని నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరించింది. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ వారి ఛాంబర్‌లో చిన్నారి తల్లిదండ్రులను పావని – వంశీని అభినందించారు.