News December 25, 2024
KNR: ‘‘భారత్ బ్రాండ్” విక్రయ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి
కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఆహార ఉత్పత్తుల విక్రయాలు జరపాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన “భారత్ బ్రాండ్” విక్రయవాహనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.
Similar News
News January 21, 2025
సూరమ్మ ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ విప్, సిరిసిల్ల కలెక్టర్
కథలాపూర్ మండలం కలిగోట గ్రామశివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టును మంగళవారం సాయంత్రం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా పరిశీలించారు. బుధవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సూరమ్మ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ముందస్తుగా ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.
News January 21, 2025
రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఉత్తమ్
రేపు నీటిపారుదల మరియు పౌర సరఫరాలశాఖ మంత్రి జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో నిర్వహించే గ్రామసభలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం గంగాధర మండలంలో నిర్వహించనున్న గ్రామసభ పాల్గొంటారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
News January 21, 2025
ఈనెల 24న కరీంనగర్‌కు కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్
కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఈనెల 24న కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ పట్టణంలోని స్టేడియం కాంప్లెక్స్, హౌసింగ్ బోర్డు వాటర్ ట్యాంక్, కుమార్వాడి గవర్నమెంట్ స్కూల్, హౌజింగ్ బోర్డులో నిర్వహించబోయే బహిరంగ సభా స్థలి, డంప్ యార్డ్‌ను పరిశీలించారు.