News September 3, 2024
KNR: భారీ వర్షాలకు పంట పొలాల్లో ఇసుక మేటలు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గర్జనపల్లిలో పడిపోయిన పదిహేను విద్యుత్తు స్తంభాలను సెస్ సిబ్బంది సరి చేశారు. మూలవాగు, పెద్దవాగు పరివాహక ప్రాంతంలో పైరు కొట్టుకుపోతుండటంతో పంట పొలాలు కోతకు గురయ్యాయి. భారీగా ఇసుక మేటలు వేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరి మీ పొలం పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News September 11, 2024
కొండగట్టు బస్సు ప్రమాద ఘటనకు ఆరేళ్లు!
కొండగట్టు రోడ్డులో బస్సు ప్రమాదం జరిగిన ఘటనకు నేటితో ఆరేళ్లు పూర్తైంది.108 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాటు రోడ్డు లోయలో పడి 65 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడి జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే ఆతి పెద్ద ప్రమాదంగా నిలిచింది. ఆ తర్వాత ప్రభుత్వం రూ.1.50 కోట్లు వెచ్చించి ఘాట్ రోడ్డుకు ఇరువైపులా పలుచోట్ల రక్షణ గోడలు, తక్కువ ఎత్తుతో వేగనియంత్రికలు నిర్మించింది.
News September 11, 2024
మారుముల ప్రాంత యువత క్రీడల్లో రాణించాలి: ఎస్పీ
మారుమూల ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట, సనుగుల గ్రామంలో మంగళవారం సాయంత్రం యువతకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ.. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలన్నారు. మన జీవనశైలిలో చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని అన్నారు.
News September 10, 2024
జగిత్యాల: మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్
జగిత్యాల జిల్లాలోని సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపెర్వైజర్‌లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో డెంగీ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందని పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో ఫాగింగ్ చేయాలనీ, పిచ్చి మొక్కల్ని తొలిగించి జ్వరాలు వచ్చే చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.