News July 13, 2024
KNR: భ్ర్రూణ హత్యల నిర్ధారణ.. హాస్పిటల్ సీజ్

HZBDలో గర్భ విచ్ఛిత్తి ఘటనతో ఇన్‌ఛార్జి DMHO సుజాత స్థానిక మాధవి హాస్పిటల్‌ను శుక్రవారం సీజ్ చేశారు. ఓ యువతి గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు ఆమెను ఈ హాస్పిటల్‌కు తీసుకొచ్చి గర్భవిచ్ఛిత్తి చేయించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆమె తల్లిదండ్రులతో సహా పలువురిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు.
Similar News
News February 13, 2025
KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పరిశీలకుల నియామకం

పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పరిశీలకులను నియమించిందని రిటర్నింగ్ ఆఫీసర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు సంజయ్ కుమార్ నంబర్ 9398416403, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా నంబర్ 7993744287లో సంప్రదించాలని తెలిపారు.
News February 13, 2025
చోరీ చేసింది వీళ్లే: కథలాపూర్ ఎస్ఐ నవీన్

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో బుధవారం వృద్ధురాలి మెడలో నుంచి ఇద్దరు యువతులు బంగారం దొంగిలించిన సంగతి తెలిసిందే. ఈ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీని స్థానిక ఎస్ఐ నవీన్ కుమార్ గురువారం విడుదల చేశారు. అనాథ పిల్లలకు డోనేషన్ ఇవ్వాలంటూ వారు గ్రామాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారని, ఈ ఫొటోలో ఉన్న యువతులను ఎవరైనా గుర్తిస్తే తన ఫోన్ నంబర్ 8712656793కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.
News February 13, 2025
KNR: ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి: అదనపు కలెక్టర్

ఎలక్షన్ కమిషన్ నియమావళికి అనుగుణంగా ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అందించిన కరదీపిక లోని మార్గదర్శకాలు పాటించాలన్నారు.