News May 2, 2024
KNR: మరణంలోనూ మరో ఇద్దరికి కాంతి పంచారు
మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన గీట్ల ప్రతాప్ రెడ్డి(102) అనే పోలీసు పటేల్ అనారోగ్యంతో మరణించారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. HYD-LV ప్రసాద్ ఐ ఆసుపత్రి టెక్నీషియన్ రాజన్న ఆధ్వర్యంలో మృతుడి నేత్రాలను సేకరించారు. కుటుంబ సభ్యులు దామోదర్ రెడ్డి, సుగుణ, నరోత్తం రెడ్డి, పుష్ప, రామకృష్ణారెడ్డి, పద్మ, సుజాత, రాం రెడ్డి, పుష్పా, కృష్ణారెడ్డి, నిర్మల ఉన్నారు.
Similar News
News November 13, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కోరుట్ల నుంచి జగిత్యాలకు పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ @ ఎమ్మెల్యే పాదయాత్రలో దొంగల చేతివాటం @ ధాన్యం కొనుగోళ్లపై సిరిసిల్ల కలెక్టర్ సమీక్ష @ రామగుండంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు @ మానకొండూరులో పురుగుల మందు డబ్బాతో రైతు హల్చల్ @ తిమ్మాపూర్‌లో కారు, బస్సు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ జగిత్యాల కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసన
News November 12, 2024
ఇష్టమైతేనే వివరాలు ఇవ్వాలి: కలెక్టర్ పమేలా
రాబోయే రోజుల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. యజమానికి ఇష్టమైతేనే వివిధ డాక్యుమెంట్ల వివరాలు సమర్పించాలని సూచించారు. సర్వేకు ప్రజలంతా సహకరిస్తున్నారని అన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షల 30 వేల ఇండ్లను 2700 ఎన్యుమరైటర్లు సర్వే చేస్తున్నారని వివరాలు వెల్లడించారు.
News November 12, 2024
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసమే సర్వే: కలెక్టర్
రాబోయే రోజుల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. యజమానికి ఇష్టమైతేనే వివిధ డాక్యుమెంట్ల వివరాలు సమర్పించాలని, సర్వేకు ప్రజలంతా సహకరిస్తున్నారన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సుమారు రూ.3.30 లక్షల ఇళ్లు సర్వే చేయబోతున్నట్లు తెలిపారు.