News March 3, 2025

KNR: మల్కా కొమురయ్య నేపథ్యం ఇదే..!

image

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.1983లో ఆయన శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.

Similar News

News January 2, 2026

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

image

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్‌గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్‌నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్‌‍కాస్ట్‌లో వివరించారు.

News January 2, 2026

KMR: ఈ నెల 3న జాబ్ మేళా

image

కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల మూడో తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం చెప్పారు. బీపీఓ పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News January 2, 2026

ఈడుపుగల్లుకు రైలు కూత.. 49 కి.మీ కొత్త రైల్వే లైన్

image

తరిగొప్పుల-దుగ్గిరాల మధ్య ప్రతిపాదిత 49k.m కొత్త రైల్వే లైన్‌లో ఈడుపుగల్లు రైల్వేస్టేషన్ కేంద్రంగా మారనుంది. లొకేషన్ సర్వే, మట్టి నమూనాల పరిశీలన పూర్తికావడంతో భూసేకరణ, ట్రాక్‌, స్టేషన్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. తరిగొప్పుల నుంచి చీలి, మంతెన దక్షిణంగా రైవాస్ కాలువ మీదుగా ఈడుపుగల్లు,వణుకూరు వైపు ట్రాక్‌ వెళ్లనుంది. చోడవరం వద్ద రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికీ కసరత్తు సాగుతోంది.