News March 3, 2025

KNR: మల్కా కొమురయ్య నేపథ్యం ఇదే..!

image

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.1983లో ఆయన శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.

Similar News

News July 8, 2025

జగిత్యాల: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి’

image

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

News July 8, 2025

ప్రెస్ క్లబ్‌కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్

image

TG: తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీ‌లో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అన్నారు. ‘రైతు శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రమ్మని చెబితే సీఎం ఢిల్లీ వెళ్లారు. ఆయన బదులు మంత్రులు ఎవరైనా వస్తారని భావిస్తున్నా. ఎవరొచ్చినా చర్చకు సిద్ధం. అక్కడే ఎదురుచూస్తాం. సీఎం ఇంకో రోజు టైమ్ ఇచ్చినా చర్చకు వస్తాం’ అని తెలిపారు.

News July 8, 2025

NLG: స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

image

స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో సత్తా చాటాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఉమ్మడి జిల్లాకు AICC కార్యదర్శి సంపత్ కుమార్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. త్వరలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టాలని అధిష్ఠానం ఆదేశించింది.