News March 3, 2025

KNR: మల్కా కొమురయ్య నేపథ్యం ఇదే..!

image

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.1983లో ఆయన శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.

Similar News

News March 19, 2025

బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధమవ్వండి: కలెక్టర్

image

మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. త్వరలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌పై బుధవారం తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గతంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో చర్చించి త్వరలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ తేదీలను ప్రకటిస్తామన్నారు. 

News March 19, 2025

NRML: SC వర్గీకరణ, BC రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం: శ్రీహరిరావు

image

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు అన్నారు. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

News March 19, 2025

తాండూర్: ఇంటి పన్ను వసూలు 74% జిల్లాలోని చివరి స్థానం

image

తాండూర్ మండల వ్యాప్తంగా 33 గ్రామపంచాయతీలో నేటి వరకు 74% ఇంటి పన్ను వసూలు అయినట్లు మండల పంచాయతీ అధికారులు తెలిపారు. 33 గ్రామపంచాయతీలో 100% కంటే తక్కువ ఇంటి పన్ను వసూలు అయిందని, మార్చి చివరి నాటికి 100% ఇంటి పన్ను వసూళ్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు ముమ్మరంగా పని చేయాలని ఇప్పటికే అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోనే చివరి స్థానంలో ఇంటి పన్ను వసూళ్లలో తాండూరు మండలం ఉంది. 

error: Content is protected !!