News March 3, 2025

KNR: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

image

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.1983లో ఆయన శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.

Similar News

News December 5, 2025

వలస కూలీల పిల్లలను బడిలో చేర్చాలి: KNR కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో వలస కూలీలు, ఇటుక బట్టీల కార్మికుల పిల్లలను గుర్తించి ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాధికారులను ఆదేశించారు. పిల్లలకు రవాణా సాయం అందించాలని ఇటుక బట్టీల యజమానులను కోరారు. అలాగే, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, స్పెషల్ క్లాస్‌లు పర్యవేక్షించి నూరు శాతం ఫలితాలు సాధించాలని సూచించారు.

News December 5, 2025

ఎన్నికల భద్రతపై సమీక్షించిన సీపీ

image

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రతపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 104 రూట్లు, 57 క్లస్టర్లను ఏర్పాటు, 508 మళ్లీ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, భద్రతా ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 4, 2025

కరీంనగర్‌: మూడు గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

కరీంనగర్ జిల్లా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడుచోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చొప్పదండి మండలం దేశాయిపేటలో తిరుపతి, పెద్దకురుమపల్లిలో స్వరూప ఏకగ్రీవం కాగా, రామడుగు మండలం శ్రీరాములపల్లిలో సుగుణమ్మ సర్పంచ్‌గా ఖరారయ్యారు. దేశాయిపేటలో సర్పంచ్‌తో పాటు పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా తెలిపారు.