News March 3, 2025

KNR: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

image

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.1983లో ఆయన శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.

Similar News

News March 19, 2025

కరీంనగర్: నలుగురు విద్యార్థులు డీబార్

image

కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2లో నలుగురు విద్యార్థులు డీబార్ అయినట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 15,965 మంది విద్యార్థులకు గాను 15,563 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 402 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు.

News March 19, 2025

కొత్తపల్లి: మనవడని దత్తత తీసుకుంటే.. నమ్మించి మట్టుబెట్టాడు!

image

కొత్తపల్లి మండల శివారులో ఈనెల 15న వెంకటమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైన విషయం తెలిసిందే. వెంకటమ్మను హత్య చేసిన మనవడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటమ్మకు కొడుకులు లేకపోవడంతో బిడ్డ కొడుకుని దత్తతకు తీసుకుని వివాహం జరిపించింది. వెంకటమ్మ వద్ద ఉన్న డబ్బు, బంగారం కోసం తరచూ ఇబ్బందులు పెట్టడంతో బంధువుల ఇంటి వద్ద ఉంటోంది. LIC డబ్బులు వచ్చాయని పిలిపించి హత్యచేసి పారిపోగా పోలీసులు అరెస్టు చేశారు

News March 19, 2025

కరీంనగర్ ఏసీపీ నరేందర్‌కు ప్రమోషన్

image

కరీంనగర్ టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోపతి నరేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఏఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. పదోన్నతిపై ఆయనను హైదరాబాదులోని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ సందర్భంగా నరేందర్ కు కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!