News March 12, 2025

KNR: మహిళా ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతలోనూ కీలకపాత్ర పోషిస్తున్న మహిళ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వైజాగ్ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టీఎన్జీవో భవన్‌లో ఆరోగ్య మహిళా కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని మాట్లాడారు. మహిళలు కుటుంబ పనులతో పాటు ఉద్యోగాలలో బిజీగా ఉంటారన్నారు. వారు ప్రతి ఆరునెలలకు ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Similar News

News September 18, 2025

KNR: నేటి నుంచి సదరం క్యాంపులు

image

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి 24వ తేదీ వరకు సదరం క్యాంపులు జరగనున్నాయని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు మీసేవ కేంద్రాల ద్వారా తమ పేరును నమోదు చేసుకొని, కేటాయించిన తేదీల్లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హాజరుకావాలని కోరారు. మొత్తం 676 మందికి ఈ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.

News September 18, 2025

KNR: SRR కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

KNR సిటీలోని SRR ప్రభుత్వ కళాశాలలో వివిధ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దోస్త్ 2వ విడత స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం నేడు, రేపు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. కళాశాలలో వివిధ కోర్సుల్లో 57 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్స్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో సమయానికి హాజరుకావాలన్నారు.

News September 17, 2025

HZB: తల్లిని చూసుకుంటామని ముందుకొచ్చిన కుమారులు

image

హుజూరాబాద్ మండలం కనుకులగిద్దెకు చెందిన ములుగు రాజమ్మ తన ముగ్గురు కుమారులు తనను పోషించడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన RDO ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు నెలకు రూ.3,000 చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కాగా, దీని అమలుపై జిల్లా కలెక్టర్, సంక్షేమ అధికారిణి ఆధ్వర్యంలో విచారణ జరపగా రాజమ్మ కుమారులు ఇకపై తమ తల్లిని చక్కగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.