News April 25, 2024
KNR: మానసిక సమస్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరైనా మానసిక ఆందోళనలు లేదా మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు మానసిక వైద్యుడిని సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత సూచించారు. చిరాకు పడడం, ఆసక్తిని కోల్పోవడం, నిద్రలేమి వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురి అయినట్లు భావిస్తే టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ఫోన్ చేసి మానసిక వైద్యుడు సలహాలను సూచనలను ఉచితంగా పొందవచ్చునని తెలిపారు.
Similar News
News January 9, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.70,412 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.28,348, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.29,890, అన్నదానం రూ.12,174 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
News January 8, 2025
కొండగట్టులో ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి వేడుకలు
మల్యాల మండలంలోని ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 10న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి తెలిపారు. తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠించి తర్వాత అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వారా దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వివరించారు.
News January 8, 2025
HYDలో సిరిసిల్ల యువకుడి సూసైడ్
HYD కొంపల్లిలో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. శ్రీగాధ మనోహర్(25) HYDలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఉరేసుకుని చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరిలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.