News April 18, 2024

KNR: మామిడి భళే కాసింది.. ఒకే చోట 22 కాయలు

image

కరీంనగర్ జిల్లాలో వింత జరిగింది. ఓ మామిడి చెట్టుకు ఒకే కొమ్మకు దాదాపు 22 కాయలు కాసింది. ఈ ఘటన KNR జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లెకి చెందిన కర్ర జగన్మోహన్ రెడ్డి మామిడి తోటలో జరిగింది. రైతు మాట్లాడుతూ.. గతేడాది ఈదురు గాలులకు కొమ్మలు విరిగిపోవడంతో చెట్టు ఎండిపోయే దశకు చేరిందని అన్నారు. ఇక ఈ చెట్టు కాత కాయదనుకున్నా కానీ, ఒకే చోట సుమారు 50 కాయల వరకు కాసిందని అన్నారు.

Similar News

News November 24, 2025

KNR: డిసెంబర్ 1 నుంచి 6 వరకు డి.ఎల్.ఇడి పరీక్షలు: డీఈఓ

image

కరీంనగర్ జిల్లాలోని డి.ఎల్.ఇడి. (D.El.Ed.) ప్రథమ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించబడతాయని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఎస్. మొండయ్య తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండు పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ సూచించారు.

News November 24, 2025

KNR: గత 43 నెలల నుంచి రాష్ట్రంలో ‘తొలి స్థానం’

image

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ వీరారెడ్డి తెలిపారు. దంత విభాగంలో గత 43 నెలల నుంచి రాష్ట్రంలో తొలి స్థానంలో నిలవడం అభినందనీయమని. 9 నెలలు నుండి వివిధ నోటి శస్త్ర చికిత్సలు బయాప్సీ 53, ట్రామా 42, ఓడోంటోజెనిక్ కెరటోసిస్ట్ 10, డెంటిజరస్ సీస్ట్ 1, డెంటిజరస్ సిస్ట్ 12, అమెలబ్లాస్టోమా 4, ఓరోఫేషియల్ బర్న్స్ 10, లుడ్విగ్స్ అంజైనా 26 లు చేసినట్లు తెలిపారు.

News November 24, 2025

KNR: స్కీల్ డెవలప్‌మెంట్ కోర్సుకు ధరఖాస్తుల ఆహ్వానం

image

క్రాష్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకు నిరుద్యోగ క్రైస్తవ మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలిపారు. సోలార్ సంస్థలో టెక్నిషియన్ ఉచిత శిక్షణ ఉంటుందని దరఖాస్తుతో అభ్యర్థి ఆధార్ తదితర సర్టిఫికేట్లు డిసెంబర్ 10 వరకు జిల్లా సంక్షేమ ఆఫీస్‌లో అప్లై చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 8782957085, 9989727382 నంబర్లో సంప్రదించాలని కోరారు.