News February 20, 2025
KNR: మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు: జిల్లా విద్యాధికారి

మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం 10 ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్ ప్రథమ సంవత్సరం 17799, ద్వితీయ సంవత్సరానికి 17763 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మొత్తం 58 సెంటర్లు ఏర్పాటు చేశామని కరీంనగర్లో 37 సెంటర్లు ఉన్నాయన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News March 26, 2025
కరీంనగర్: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనిపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు అమాత్య యోగం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్ బాబు, పొన్నం కేబినెట్లో ఉన్నారు.
News March 25, 2025
KNR: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం ఆమె కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం పూర్తిగా పండిన తర్వాతనే హార్వెస్ట్ చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల వారీగా నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటుచేసి, తేమను కొలిచే యంత్రాలు, గన్ని సంచులు, టార్పలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలన్నారు.
News March 25, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కొత్తపల్లి-ధర్మారం 37.7°C నమోదు కాగా, తాంగుల, ఈదులగట్టేపల్లి, బురుగుపల్లి, ఇందుర్తి 37.6, జమ్మికుంట, మల్యాల 37.5°C, నుస్తులాపూర్ 37.3, కరీంనగర్ 37.1, వీణవంక, గట్టుదుద్దెనపల్లె, పోచంపల్లి 36.9, గంగిపల్లి 36.8, తాడికల్ 36.5, బోర్నపల్లి 36.1, దుర్శేడ్, చింతకుంట, గుండి 36.0°C గా నమోదైంది.