News January 14, 2025
KNR: ముగ్గులతో మొదలైన సంక్రాంతి సంబురాలు!

KNR ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి పండుగ మొదలైంది. జిల్లాలో మహిళలు, ఆడపడుచులు ఉదయాన్నే 4 గంటలకు లేచి వాకిట్లో ముగ్గులు, రంగవల్లులతో పోటీపడ్డారు. తదనంతరం స్నానాలు ఆచరించి గోబ్బేమ్మలు, ధాన్యలతో, రేగిపండ్లతో ముగ్గులను అలంకరించి చిన్నపిల్లలకు బడబుడకలతో దిష్టిని తీశారు. దీంతో ఉదయం ముగ్గులతో పండుగ మొదలుకొని సాయంత్రం వరకు కొత్త అల్లుళ్ల దావత్లు, తీపి వంటకాలతో పండుగను జరుపుకుంటారు.
Similar News
News October 18, 2025
KNR: మోటార్ వెహికల్ యాక్ట్ ఉల్లంఘనపై కొరడా

KNR కమిషనరేట్ పరిధిలో మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు CP గౌష్ ఆలం తెలిపారు. ఇప్పటివరకు 50కి పైగా చలానాలు పెండింగ్లో ఉన్న 301 మంది వాహనదారుల నుంచి మొత్తం రూ.64,39,715 జరిమానా వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. పెండింగ్ చలానాలు కలిగిన వాహనదారులు వాటిని తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదుచేస్తామని CP హెచ్చరించారు.
News October 18, 2025
KNR: ‘చట్టాలపై అవగాహన అవసరం’

తిమ్మాపూర్ మండలంలోని డైట్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ మాట్లాడుతూ, న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో యాక్ట్ వంటి చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా మెలగాలని ఆయన సూచించారు.
News October 17, 2025
రసమయి బాలకిషన్పై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ ఫిర్యాదు

మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ MLA రసమయి బాలకిషన్పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు CP గౌష్ ఆలంకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గోసి గొంగడి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన రసమయి బాలకిషన్ ఈరోజు వందల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్లు ఎలా సంపాదించారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.