News April 10, 2024
KNR: మే 3న ఉద్యోగంలో జాయినింగ్.. బీటెక్ విద్యార్థి మృతి

ఈతకు వెళ్లిన ఓ యువకుడికి ఫిట్స్ వచ్చి బావిలోనే మృతి చెందిన ఘటన HZBD మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కందుగులకు చెందిన విజయ్ కుమార్(21) HYDలో బీటెక్ చదువుతున్నాడు. అయితే పండగకు స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో స్నిహితులతో కలిసి ఊరి చివరి బావిలోకి ఈతకు వెళ్లగా.. బావిలోనే మునిగిపోగా నీటిని తోడి మృతదేహాన్ని గుర్తించారు. కాగా, విజయ్‌కు ఇటీవల ఓ ఉద్యోగం రాగా.. మే 3న చేరాల్సి ఉంది.
Similar News
News February 23, 2026
కరీంనగర్లో ప్రజావాణిలో 367 వినతులు స్వీకరణ

జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి వాకడే పాల్గొని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా వాణి దరఖాస్తులను ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ 367 దరఖాస్తులు స్వీకరించారు.
News February 23, 2026
క్రీడల్లో కరీంనగర్ పోలీసుల పతకాల వేట

సైబరాబాద్‌లో జరిగిన 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు 35 పతకాలతో సత్తా చాటారు. ఇందులో 9 స్వర్ణ, 13 రజత, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏసీపీ మాధవి, పీసీలు స్వప్న, శ్రీజ, శ్రీధర్ పలు విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. విజేతలను సీపీ గౌష్ ఆలం అభినందిస్తూ.. విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల్లో రాణించడం గర్వకారణమని కొనియాడారు.
News February 22, 2026
రేపు యథావిధిగా ‘ప్రజావాణి’: జిల్లా కలెక్టర్

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఉదయం నిర్ణీత సమయానికి అధికారులు హాజరై ఫిర్యాదులను స్వీకరిస్తారని పేర్కొన్నారు.


