News April 25, 2024

KNR: రూ.10 కాయిన్స్‌తో నామినేషన్ వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి

image

కరీంనగర్ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు పేరాల మానస రెడ్డి డిపాజిట్ రూపంలో పది రూపాయల కాయిన్స్‌తో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇంటి నుంచి గంపలో తీసుకొచ్చిన రూ.25 వేల నాణేలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసింది. తన అఫిడవిట్ సమర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి సమర్పించారు.

Similar News

News November 26, 2025

‘పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి’

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను 3 విడతలలో నిర్వహిస్తామని, డిసెంబర్ 11న 1 విడత, డిసెంబర్ 14న 2వ విడత, డిసెంబర్ 17న 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.

News November 26, 2025

KNR: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ

image

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశ రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు వుందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కట్టుబడి వుండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.

News November 26, 2025

KNR: రేపు దివ్యాంగులకు ఆటల పోటీలు

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 27న (గురువారం) కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ కేటగిరీల్లో జరిగే ఈ పోటీలకు దివ్యాంగులు సదరం, ఆధార్ కార్డులతో హాజరు కావాలని, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.