News February 27, 2026
KNR: రూ.151కే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు

భద్రాచల సీతారామయ్య కళ్యాణ తలంబ్రాలను రూ.151/- లకే అందించే పోస్టర్‌ను KNR రీజనల్ ఆఫీస్ కార్యాలయంలో ఆర్టీసీ KNR RM బి.రాజు ఆవిష్కరించారు. ఉమ్మడి KNR జిల్లాకు చెందినవారు రూ.151 చెల్లించి మార్చి 31 వరకు తలంబ్రాలను బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. KNR -9154298561, 9154298581, HZB, HSBD-9154298559, JGTL, MTPY, KRTL-7780250439, SRCL, VMWD – 9154298576, GDK, PDPL, MNTY-9949407275 కు సంప్రదించాలని సూచించారు.
Similar News
News April 18, 2026
కామారెడ్డి: అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ రైతు తన పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన లింగవ్వగా గుర్తించారు. భర్త మరణం తర్వాత అప్పుల భారం భరించలేక పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.