News July 15, 2024

KNR: రూ.20 లక్షల అదనపు కట్నం తేవాలని వేధింపులు

image

అదనపు కట్నం తేవాలని వేధించిన భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. CI రవి వివరాల ప్రకారం.. జమ్మకుంట మం. మాచనపల్లికి చెందిన స్రవంతి, ఇల్లందకుంట మం.కి చెందిన సదయ్యకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉద్యోగరిత్యా వీరు న్యూజిలాండ్‌లో ఉండి గతేడాది HYDకి వచ్చారు. అయితే రూ.20లక్షల అదనపు కట్నం తేవాలని భార్యను నెలక్రితం పుట్టింటికి పంపాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో అత్త, బావతో పాటు.. భర్తపై కేసు నమోదైంది.

Similar News

News December 12, 2025

ప్రచారానికి తెర.. కరీంనగర్ పల్లెలు సైలెంట్.!

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో పల్లెల్లో ఎన్నికల సందడికి తెరపడింది. పాటలు, కరపత్రాలతో ఓటర్లను ఆకర్షించిన అభ్యర్థులు మౌనం వహించారు. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, అధికారులు ఓటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

News December 12, 2025

కరీంనగర్: రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధం

image

మొదటి విడత ఎన్నికలు పూర్తయినందున, రెండో విడత ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. చిగురుమామిడి మండలంలోని 17, తిమ్మాపూర్‌లో 23, మానకొండూరులో 17, శంకరపట్నం 29, గన్నేరువరం మండలంలో 27 గ్రామపంచాయతీలకు గాను 1046 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

News December 12, 2025

కరీంనగర్‌ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచిందంటే..?

image

కరీంనగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరిచింది.
చొప్పదండి: 16 GPలకు కాంగ్రెస్ 8 , BRS 6 , ఇతరులు 2
గంగాధర:33 GPలకు కాంగ్రెస్ 9 ,BRS 3 ,BJP 9, ఇతరులు 9
కరీంనగర్ రూరల్: 14 GPలకు కాంగ్రెస్ 6 , BRS 1 , BJP 4 , ఇతరులు 2
కొత్తపల్లి: 6 GPలకు కాంగ్రెస్ 1 , BRS 2 , BJP 1 , ఇతరులు 2
రామడుగు: 23 GPలకు కాంగ్రెస్ 9 , BRS 4 , BJP 5 , ఇతరులు 4