News July 30, 2024

KNR: రెండో విడత రుణమాఫీ వివరాలు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ రెండో విడత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 21,785 మంది రైతులకు రూ.207.82 కోట్లు, జగిత్యాల జిల్లాలో 17,903 మంది రైతులకు రూ.169.11 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 13,401 రైతులకు రూ.124.41 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో 12,202 మంది రైతులకు రూ.117.77 కోట్ల రుణమాఫీ వర్తించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News February 27, 2026

BREAKING: కరీంనగర్‌లో కొలువుదీరిన కొత్త కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టగా.. నూతన కలెక్టర్‌కు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చిత్రా మిశ్రా పేర్కొన్నారు.

News February 27, 2026

KNR: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్

image

తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు మార్చి 4లోగా tgss.telangana.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. మార్చి13 నుంచి మండల, 28 నుంచి జిల్లా, ఏప్రిల్ 27 నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయి. వివరాలకు 9704061725 సంప్రదించండి.