News February 10, 2025

KNR: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. KNR జిల్లాలో 15 ZPTCలు, 170 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News November 16, 2025

KNR: 17 నుంచి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు

image

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని జిల్లా సంక్షేమ అధికారి కె.సబిత కుమారి తెలిపారు. నవంబర్ 17న జిల్లా పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం, 18న మండలాల్లో ఆరోగ్య శిబిరాలు, 19న కలెక్టరేట్‌లో ప్రధాన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వయోవృద్ధులు ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె సూచించారు.

News November 16, 2025

చొప్పదండి: డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్‌కు భయపడి యువకుడి ఆత్మహత్య

image

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఫైన్ చెల్లించలేనన్న మనోవేదనతో చొప్పదండి బీసీ కాలనీకి చెందిన సూర విజయ్ (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పోలీసులకు పట్టుబడిన విజయ్, శనివారం కోర్టుకు హాజరైనప్పటికీ మేజిస్ట్రేట్ లేకపోవడంతో తిరిగి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫైన్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News November 16, 2025

KNR: విటమిన్ గార్డెన్ పై దృష్టి పెట్టాలి:కలెక్టర్

image

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్లపై బయోసైన్స్ ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. గార్డెన్‌లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడంతో పాటు, పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లోని విటమిన్లు, మినరల్స్‌ గురించి కూడా విద్యార్థులకు వివరించాలని ఆమె సూచించారు.