News February 10, 2025

KNR: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. KNR జిల్లాలో 15 ZPTCలు, 170 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News March 18, 2025

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర 41.5°C నమోదు కాగా, ఇందుర్తి, చిగురుమామిడి 40.1, కొత్తపల్లి-ధర్మారం, ఈదులగట్టేపల్లి 40.0, రేణికుంట 39.8, నుస్తులాపూర్ 39.7, ఖాసీంపేట 39.6, జమ్మికుంట 39.3, బురుగుపల్లి 39.1, వెంకేపల్లి 38.6, వీణవంక 38.3, కొత్తగట్టు 37.9, తాడికల్ 37.8, పోచంపల్లి 37.7, చింతకుంట, KNR 37.6, గట్టుదుద్దెనపల్లె, ఆసిఫ్నగర్ 37.3°C గా నమోదైంది.

News March 18, 2025

KNR: కొత్త కాన్సెప్ట్‌కు జిల్లా కలెక్టర్ శ్రీకారం..

image

KNRలోని కాశ్మీర్ గడ్డ రైతుబజార్ ఒక అరుదైన కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఇక్కడ ఒక వినూత్నమైన కొత్త కాన్సెప్ట్‌తో కూరగాయల సంతను ఏర్పాటు చేశారు. ఈ కూరగాయల సంతను ఏర్పాటు చేసింది.. రైతులో.. గ్రామీణ ప్రాంత ప్రజలో కాదు..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థిని, విద్యార్థులు. కలెక్టర్ పమేలా సత్పతి జిల్లాలో ఎంపిక చేసిన 12ప్రభుత్వ పాఠశాలల నుంచి 60మంది విద్యార్థులతో ఏర్పాటు చేయించారు.

News March 18, 2025

ఇల్లందకుంట: GREAT.. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్

image

నిన్న విడుదలైన గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఇల్లందకుంట మండలం సిరిసేడుకి చెందిన బీనవేని పరుశురాం ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్ సాధించి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పరుశురాముది పేద రైతు కుటుంబం. అయినప్పటికీ కష్టపడి చదివి 2023 పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం పరుశురాం కేయూలో PHD చేస్తున్నాడు.

error: Content is protected !!